హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాదికి ఎంటెక్, ఎంఫార్మసీ ఫస్టియర్ విద్యాక్యాలెండర్ను జేఎన్టీయూ విడుదల చేసింది. 9 నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభిస్తామని రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. 23 నుంచి 28 వరకు దసరా సెలవులుంటాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి 4 నుంచి 19 వరకు ఎంటెక్ మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు వివరించారు. అలాగే వచ్చేఏడాది మార్చి 20 నుంచి రెండో సెమిస్టర్ క్లాసులు ప్రారంభించి, ఆగస్టు 19 నుంచి 31 వరకు రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
వచ్చేఏడాది మార్చి 15 నుంచి 30 వరకు ఎంఫార్మసీ మొదటి సెమిస్టర్ పరీక్షలుంటాయని పేర్కొన్నారు. రెండో సెమిస్టర్ తరగతులు ఏప్రిల్ 1 నుంచి నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 17 నుంచి 28 వరకు రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నామని రిజిస్ట్రార్ తెలిపారు. వచ్చేఏడాది ఫిబ్రవరి 26 నుంచి మార్చి 12 వరకు మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. మార్చి 14 నుంచి రెండో సెమిస్టర్ తరగతులు ప్రారంభించి, ఆగస్టు 19 నుంచి 31వరకు రెండో సెమిస్టర్ పరీక్షలుంటాయని వివరించారు. క్యాలెండర్ వివరాలకు వర్సిటీ వెబ్సైట్ను సంప్రదించాలని రిజిస్ట్రార్ పేర్కొన్నారు.