Jeevan Reddy | హైదరాబాద్, మార్చి 10(నమస్తే తెలంగాణ): పంటలకు మద్దతు ధర అందక రైతులు నష్టపోతున్నారని, వెంటనే మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వమే పంటలు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రా శారు. పంటల కొనుగోలుపై సొంత పార్టీ ఎమ్మెల్సీ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. నిరుడు పసుపు క్వింటాల్‌కు రూ.15వేల ధర పలికితే, ప్రస్తుతం రూ. 8-10 వేలు మాత్రమే పలుకుతుందని పేర్కొన్నారు. రూ.12 వేల మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మొక్కజొన్న క్వింటాల్‌కు రూ.2వేలకు పడిపోయిందని, కంది ధర రూ.7550 ఉండగా, మార్కెట్లో రూ. 6500లకే కొనుగోలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.