హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు, పాత నేతల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సమయం, సందర్భం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు, నేతలపై పాత కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
తాజాగా గాంధీభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీనో నాకు తెలియదు?.. స్పీకర్‌ని అడిగితే తెలుస్తదని ఎద్దేవా చేశారు. తాను చాలా సీనియర్ ప్రజాప్రతినిధిని అని, నాకు జగిత్యాల అభివృద్ధిపై అవగాహన ఉందని పేర్కొన్నారు.