ఆర్మూర్‌టౌన్, జనవరి 23: అమలు కాని 6 గ్యారెంటీలే కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి నాంది అని బీఆర్ఎస్ నిజామాబాద్ జి ల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు. ఇందిరమ్మ ఇం డ్లు, రేషన్‌కార్డుల మంజూరు పే రుతో నిర్వహిస్తున్న గ్రామసభల్లో ప్రజల తిరుగుబాటు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు నిదర్శనమని తెలిపారు.
ఇండ్లు ఎప్పుడు కట్టిస్తారంటూ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డిపై మ హిళలు తిరగబడ్డారని, భువనగిరి ఎమ్మెల్యేను ఉరికిచ్చి కొట్టారని గు ర్తుచేశారు. స్థానిక ఎన్నికల్లో హీరో కావాలని మోసాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ జీరో కాక తప్పదని తెలిపారు.