హైదరాబాద్, జులై 6(నమస్తే తెలంగాణ) : మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి చేప పిల్లల పంపిణీ కాకుండా, నేరుగా నగదు బదిలీ అంశాన్ని పరిశీలించాలని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరిని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆదివారం మంత్రికి లేఖ రాశారు.
చేపపిల్లల కొనుగోలు కోసం టెండర్లు పిలిచి పంపిణీ చేసేందుకు అధిక సమయం పడుతున్నదని, టెండర్లలో అవకతవకలు జరిగే ఆస్కారం ఉన్నదని పేర్కొన్నారు. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు మత్స్యకార సొసైటీలకు నగదు బదిలీ చేయాలని కోరారు.