Jeevan Reddy : బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమైన టి.జీవన్ రెడ్డి(Jeevan Reddy) కాంగ్రెస్ పార్టీని కడిగిపారేశారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై పట్టు కోల్పోయిందని పేర్కొన్న ఆయన మోసపూరిత కాంగ్రెస్ పోవాలని, కేసీఆర్ మళ్లీ రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ తిరోగమనంలో పయనిస్తోందని జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ పార్టీని వీడిన టి.జీవన్ రెడ్డి బీఆర్ఎస్ గూటికి చేరడం ఖాయమైంది. ఎర్రవల్లిలో శుక్రవారం తన అనుచరగణంతో కలిసి కేసీఆర్‌తో భేటీ అయిన జీవన్ రెడ్డి ఏప్రిల్ 20న పార్టీలో చేరుతున్నానని ప్రకటించారు. కేసీఆర్‌తో దాదాపు ఐదు గంటలు చర్చించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు టీపీసీసీ నడుస్తుంది
రేవంత్ రెడ్డి వల్ల అధిష్టానం కూడా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతుంది – మాజీ మంత్రి జీవన్ రెడ్డి https://t.co/lYHEQfecR9 pic.twitter.com/BVPnRCpuz9
— Telugu Scribe (@TeluguScribe) April 10, 2026
‘ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తిరోగమనంలో పయనిస్తోంది. కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒకప్పుడు పీసీసీ చెప్పినట్టు ముఖ్యమంత్రి నడుచుకునేవారు. ఇప్పుడు సపీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టే పీసీసీ నడుచుకుంటోంది. నా విషయంలో పీసీసీ తప్పు చేసింది. కానీ, ఆ నిందను ఏఐసీసీపై వేస్తోంది. నాకు 14 సార్లుబీఫామ్ ఇచచారంటే అని నా సమర్ధత. కానీ, కొన్నాళ్లుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కలత చెందాను. అందుకే.. బీఆర్ఎస్లో చేరి కేసీఆర్‌తో కలిసి పని చేయాలనుకుంటున్నా. నేను అధికార పార్టీలోకి వెళ్ళట్లేదు.
రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో మొదలైంది
నేను అధికార పార్టీలోకి వెళ్ళట్లేదు
రెండేళ్లలో 3 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఇచ్చింది 17 వేల ఉద్యోగాలు
మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అని అన్నారు.. రెండో సంవత్సరం 1 లక్ష ఉద్యోగాలు అని అన్నారు, ఏమైంది?… https://t.co/uF6kyYGY8y pic.twitter.com/VultwMEs2y
— Telugu Scribe (@TeluguScribe) April 10, 2026
రెండేళ్లలో 3 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఇచ్చింది 17 వేల ఉద్యోగాలు. మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అని అన్నారు.. రెండో సంవత్సరం 1 లక్ష ఉద్యోగాలు అని అన్నారు, ఏమైంది?’ అని జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. పదవుల కోసమే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాలంటే తాను ఆరోజే వెళ్ళేవాడినని, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చనందుకు, ప్రజల పక్షాన పోరాడేందుకు తాను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నానని జీవన్ రెడ్డి తెలిపారు
కాంగ్రెస్‌తో 20 ఏళ్లకుపైగా అనుబంధాన్ని తెంచుకున్న జీవన్ రెడ్డి శుక్రవారం కేసీఆర్‌ను ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. తన బృందంతో కలిసి వచ్చిన జీవన్ రెడ్డికి గులబీ బాస్ ఆత్మీయంగా ఆళింగనం చేసుకున్నారు. జీవన్ రెడ్డి బృందంతో కలిసి లంచ్ చేసిన కేసీఆర్ అనంతరం.. పలు విషయాలు చర్చించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డికి పార్టీలో సముచిత ప్రాధాన్యం ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. జగిత్యాలలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా రావాలని జీవన్ రెడ్డి ఆహ్వానించగా గులాబీ అధినేత సానుకూలంగా స్పందించారని సమాచారం.
పదవుల కోసమే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాలంటే నేను ఆరోజే వెళ్ళేవాడిని
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చనందుకు, ప్రజల పక్షాన పోరాడేందుకు నేను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నాను – మాజీ మంత్రి జీవన్ రెడ్డి https://t.co/BbuSvT0lQS pic.twitter.com/3mWTqBc22Y
— Telugu Scribe (@TeluguScribe) April 10, 2026