ఖలీల్‌వాడి, జూన్ 25: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానిది గోల్డెన్ పీరియడ్ కాదని, ఎమర్జెన్సీ పీరియడ్ అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలన 50 ఏండ్లనాటి చీకటి ఎమర్జెన్సీ పీరియడ్‌ను తలపిస్తున్నదని ఒక ప్రకటనలో మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి పాలనలో ల్యాండ్, సాండ్, మైన్, వైన్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు, 420 హామీలకు ఎగనామాలు పెట్టారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కారు నయవంచనను ప్రశ్నించే వారిపై బూటకపు కేసులు, అక్రమ నిర్బంధాలు అమలు చేస్తూ ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తున్నారని తెలిపారు.
రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలి: పడాల సతీశ్
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): అపర భగీరథుడు మాజీ కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని నోరు అదుపులో పెట్టుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రాష్ట్రంపై కనీస అవగాహన లేకుండా మాట్లాడటం సిగ్గుచేటని పేర్కొన్నారు. సమయం దొరినప్పుడల్లా కేసీఆర్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని.. ఇది మానుకోవాలని హితవుపలికారు.