హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్స్-1కు దరఖాస్తుల స్వీకరణ ముగియగా, దరఖాస్తుల్లో దొర్లిన తప్పుల సవరణకు ఎన్టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) తాజాగా అవకాశమిచ్చింది. విద్యార్థు లు ఈ నెల 26, 27 తేదీల్లో ఎన్టీఏ వెబ్‌సైట్‌ను సంప్రదించి ఎడిట్ ఆప్షన్ ద్వారా తప్పులను సవరించుకోవచ్చు.
విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, పదో తరగతి, 12వ తరగతి, పాన్‌కార్డు నంబర్, పరీక్ష రాయాలనుకుంటున్న నగరం, మీడియంలో దొర్లిన తప్పులను సరి చేసుకోవచ్చు. మొబైల్ నంబర్, ఈ-మెయిల్, అడ్రస్, అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన కాంట్రాక్ట్ నంబర్, ఫొటోను మార్చుకునేందుకు వీల్లేదు.