హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్స్-1 ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. బీఈ/బీటెక్ ప్రాథమిక ‘కీ’తోపాటు విద్యార్థుల రెస్పాన్స్షీట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విడుదల చేసింది.
విద్యార్థులు ఈ నెల 6న రాత్రి 11:50 గంటలలోపు ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు తెలుపవచ్చని ఎన్టీఏ వెల్లడించింది.