హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ తుది ఫలితాలు విడుదలకానున్నాయి. ఆదివారం, లేదా సోమవారం ఈ ఫలితాలు విడుదలకానున్నాయి. జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలను జనవరిలో, సెషన్ -2 పరీక్షలను ఏప్రిల్లో నిర్వహించారు. సెషన్ -1 ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. సెషన్ -2 ఫలితాల విడుదల తర్వాత సెషన్ -1 ఫలితాలను క్రోడీకరించి రెండింటిలో ఎక్కువ వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకొని తుది ర్యాంకులు ప్రకటిస్తారు.