గురువారం 04 మార్చి 2021
Telangana - Jan 20, 2021 , 19:05:47

ముక్రా (కే)లో జయశంకర్‌ యూనివర్సిటీ విద్యార్థులు

ముక్రా (కే)లో జయశంకర్‌ యూనివర్సిటీ విద్యార్థులు

ఆదిలాబాద్‌ : జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా (కే) గ్రామాన్ని హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ యూనివర్సిటీకి చెందిన బీఎస్సీ ఫైనలియర్‌ విద్యార్థులు బుదవారం సందర్శించారు. గ్రామంలో చెత్త ద్వారా సేంద్రియ ఎరువుల తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. పల్లె ప్రగతి కార్యాచరణలో భాగంగా గ్రామంలో నిర్మించిన శ్మశానవాటిక, హరితవనం, పల్లె ప్రకృతి వనం, ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగు దొడ్లు, అంగన్‌వాడీ కేంద్రంలోని న్యూట్రి గార్డెన్‌ను పరిశీలించారు.

గ్రామాన్ని ప్రగతి బాటలో నిలిపిన సర్పంచ్‌ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాష్‌ను కలిశారు. గ్రామం పూర్తిగా బృందవనాన్ని తలపిస్తున్నదని విద్యార్థులు కొనియాడారు. కార్యక్రమంలో విద్యార్థులు శ్రద్ధ, హరిప్రియ, గోపీనాథ్‌, సుప్రియ, తదితరులున్నారు. 

ఇవి కూడా చదవండి..

యాదాద్రిలో వైభవంగా నిత్యకల్యాణం

గండిపేటకు పర్యాటక సొబగులు..డిజైన్‌ రెడీ

హ‌ర్భ‌జ‌న్‌ను వ‌దులుకున్న చెన్నై సూప‌ర్ కింగ్స్‌

సీఎం ప‌ద‌వికి కేటీఆర్ స‌మ‌ర్థుడు : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి? 

VIDEOS

logo