విశాఖపట్నం: విశాఖపట్నం నుంచి లింగంపల్లికి బయల్దేరిన జన్మభూమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (Janmabhoomi Express) సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ఉదయం 6.20 గంటలకు విశాఖ నుంచి బయల్దేరిన 2 నిమిషాలకే ఏసీ బోగీ లింక్ తెగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. రైలను విశాఖ స్టేషన్‌కు తీసుకువచ్చారు. సాంకేతిక సమస్యతో 2 బోగీలు రైలు నుంచి విడిపోయాయని అధికారులు తెలిపారు. బోగీల లింక్‌ను సరిచేసిన అనంతరం 9.30 గంటలకు రైలు అక్కడి నుంచి బయల్దేరింది. ప్రస్తుతం జన్మభూమి రైలు 3 గంటలు ఆలస్యంగా నడుస్తున్నది.
కాగా, జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజూ ఉదయం 6.15 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరుతుంది. రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్లగొండ మీదుగా లింగంపల్లికి రాత్రి 7.40 గంటలకు చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం 6.15 గంటలకు లింగంపల్లి నుంచి బయల్దేరి విశాఖకు రాత్రి 7.40 గంటలకు చేరుంది.