హైదరాబాద్, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ) : తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ వర్గ విభేదాలపై టీపీసీసీ వరింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సిద్ధంచేసిన నివేదిక ఆ పార్టీ అధిష్ఠానంలో ఆసక్తికర చర్చకు దారితీసింది. హైదరాబాద్ గాంధీభవన్‌లో మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసి ఏడు పేజీల నివేదికను ఆయన సీల్డ్కవర్లో అందజేశారు. తుంగతుర్తి కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలను పరిషరించేందుకు అధిష్ఠానం గతంలో జగ్గారెడ్డిని ప్రత్యేక పరిశీలకుడిగా నియమించింది.
మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ ఆదేశాల మేరకు ఆయన అధ్యయనం చేశారు. నివేదిక తయారీకి ముందు జగ్గారెడ్డి.. జిల్లా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితోపాటు తుంగతుర్తి ముఖ్య నేతలు, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి తనయుడు సర్వోత్తమరెడ్డి అభిప్రాయాలను సేకరించారు. వివిధ వర్గాల నేతల వాదనలు, స్థానిక పరిస్థితులు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చిం నివేదిక సిద్ధం చేసినట్టు సమాచారం. రాజీమార్గంలో పరిషారం చూపడమే నివేదిక ఉద్దేశమని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.