Paleru Farmer | మనం పాకిస్తాన్లో ఉన్నామా.. పాలేరులో ఉన్నామా..? మంత్రి పొంగులేటిపై రైతన్న ఫైర్
Paleru Farmer | పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం కేంద్రంలో రోడ్డుపై బైఠాయించిన రైతులు.. వరుస కరెంట్ కోతల నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.
Paleru farmer | కాంగ్రెస్ పాలనలో రైతులకు అవస్థలు తప్పడం లేదు.. ఓ వైపు ఆలస్యమైన వర్షాలు, మరోవైపు యూరియా కొరత, కరెంట్ కోతలతో సతమతమవుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ కరెంట్ కోతలపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో రైతుల ఆందోళనకు దిగారు. పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం కేంద్రంలో రోడ్డుపై బైఠాయించిన రైతులు.. వరుస కరెంట్ కోతల నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా ఓ రైతన్న మాట్లాడుతూ..మా ప్రాంతం మధిర నియోజకవర్గం.. ఇటు గువ్వలగూడెం దగ్గర నుంచి అవతల మధిర నియోజకవర్గం అక్కడ 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. మరి మనం పాకిస్తాన్లో ఉన్నామా.. పాలేరులో ఉన్నామా..? మంత్రి చెప్పాలన్నారు. ఈ నియోజకవర్గానికి కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. వారు చెప్పాలి సమాధానం.. పక్కనే కూతవేటు దూరంలో ఉన్న మండలంలోనేమో 24 గంటల కరెంట్ ఇస్తరు.. మన దగ్గరనేమో రోజుకు 6, 8 నుంచి 10 గంటల మధ్యలో ఇస్తారరంటూ ఫైర్ అయ్యారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో రైతుల ఆందోళన
పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం కేంద్రంలో రోడ్డుపై బైఠాయించిన రైతులు
వరుస కరెంట్ కోతల నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా రైతుల నిరసన https://t.co/He4EDQk3VF pic.twitter.com/im91pRfw8W
— Telugu Scribe (@TeluguScribe) September 10, 2026
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

