హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్లో గొడవలు సహజమేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే గొడవలు ఉంటాయని తెలిపారు.
తుంగతుర్తి వివాదం అన్నదమ్ముల మధ్య పోటీలాంటిదని, పార్టీ నేతలతో మాట్లాడి వివరాలు సేకరించినట్టు పేర్కొన్నారు. సంగారెడ్డి నుంచి తన భార్య పోటీ చేస్తారని, పార్టీ ఆదేశిస్తే తాను సిద్దిపేటలో పోటీ చేస్తానని తెలిపారు.