సూర్యాపేట, ఫిబ్రవరి 8 : కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లేస్తే అధికారంలోకి వచ్చి రెండేండ్లు అయినా ఏం అభివృద్ధి చేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నా యకులు ఏం చెప్పి ఓట్లడుగుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటు వేయాలని అడిగే వారిని గట్టిగా నిలదీయాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి జగదీశ్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరగా గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు, ప్రజలకు పేగుబంధంలా ఉన్న కేసీఆర్‌ను వారి నుంచి దూరం చేసేందుకు 420 అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి కండ్లముందు కన్పిస్తున్నదని, అందుకే అభివృద్ధికి చిరునామాగా ఉన్న కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.