‘రాకా’లో గిరిజన రాణిగా?
అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘రాకా’ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. పురాణ, వేద, వర్తమాన కాలాల్ని అనుసంధానిస్తూ సాగే కథాంశమిదని, పునర్జన్మ, ప్రతీకారం అంశాలు ప్రధానంగా ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి.
అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘రాకా’ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. పురాణ, వేద, వర్తమాన కాలాల్ని అనుసంధానిస్తూ సాగే కథాంశమిదని, పునర్జన్మ, ప్రతీకారం అంశాలు ప్రధానంగా ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో దీపికా పడుకోన్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే కథారీత్యా మరో ఇద్దరు నాయికలకు చోటుందని చెబుతున్నారు. బాలీవుడ్ నుంచి వెలువడుతున్న వార్తల్ని బట్టి ఈ సినిమాలో జాన్వీకపూర్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని తెలిసింది.
వారి పాత్రల తీరుతెన్నుల గురించి కూడా బాలీవుడ్ మీడియాలో ఆసక్తికరమైన కథనాలొస్తున్నాయి. జాన్వీకపూర్ గిరిజన రాణి పాత్రలో కనిపిస్తుందని, ‘రాకా’ కథా ప్రపంచంలో ఆమె పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని చెబుతున్నారు. ఇక రష్మిక మందన్న పురాణకాలం నాటి రక్షకురాలి పాత్రలో కనిపిస్తుందని సమాచారం. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలేనా? వీటిలో ఏమైనా వాస్తవం ఉందా? అనే విషయాల్లో స్పష్టత రావాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సిందే అంటున్నారు. ‘రాకా’ షూటింగ్ ప్రస్తుతం ముంబయిలో జరుగుతున్నది. వచ్చే ఏడాది డిసెంబర్లో ఈ సినిమా విడుదలకానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

