హైదరాబాద్ : బీఆర్ఎస్ను నామరూపాలు చేస్తామన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)వ్యాఖ్యలపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) ఘాటుగా స్పందించారు. బండి సంజయ్ చేష్టలు కేంద్ర ప్రభుత్వ సహాయ మంత్రిగా లేవు, రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి అనే విషయాన్ని మర్చిపోయాడన్నారు. రేవంత్ రెడ్డిని కాపాడలనే తాపత్రయం ఆయనలో ఎక్కువగా కనిస్తుందన్నారు. బీఆర్ఎస్పైన కేటీఆర్ పైన అక్కసు వెళ్లగక్కుతున్నాడు.
వాస్తవానికి బీజేపీ, కాంగ్రెస్ మధ్య వైరుధ్యం అనుకుంటారు. కానీ, తెలంగాణలో విచిత్రంగా ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. కేంద్రంలో మోదీ, రాహుల్ మధ్య రోజు యుద్ధం జరుగుతుంటే దానిని వదిలిపెట్టి రాష్ట్రంలో రేవంత్‌రెడ్డిని కాపాడేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నావని ప్రశ్నించారు. నువ్వు ఎంత బుకాయించిన రేవంత్ రెడ్డితో కలిసి పని చేస్తున్నావనే విషయాన్ని దాయలేవన్నారు.
రాజ్ పాకాల ఇంట్లో దావత్ చేసుకుంటే పోలీసులను ఉలిగొల్పి తప్పుడు కేసులు పెట్టారు. ఆ విషయంలో సీఎం రేవంత్ ఫెయిల్ అయ్యారు. సీఎంను కాపాడేందుకు బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేటర్ స్థాయికి దిగజారి మాట్లాడటం నీ స్థాయికి తగదన్నారు. బీఆర్ఎస్ను నామరూపాలు చేస్తామనడం నిన్నుంచి కాదు. కేంద్రంలో బీజేపీ ఆక్సిజన్ మీద నడుస్తుందనే విషయం మర్చిపోవద్దన్నారు. నువు బీజేపీ పార్టీనా, కాంగ్రెస్ పార్టీనా అనే విషయాన్ని ఆలోచించుకోవాలన్నారు. చిల్లర మాటలు మాట్లాడి అభాసుపాలు కావొద్దని హితవు పలికారు.