Anirudh Reddy | జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో రెండు సార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తాను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని అవుతానని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడి ఎంపిక సన్నాహక సమావేశాల్లో అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రుల జిల్లాలు, నియోజకవర్గాలకే ఎక్కువ నిధులు వెళ్తున్నాయని తెలిపారు. ప్రజలు గెలిపిస్తేనే కదా.. ఎమ్మెల్యే, మినిస్టర్, సీఎం అయ్యేదని అన్నారు. అందుకే తనను ఇంకో రెండు సార్లు గెలిపిస్తే.. తాను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని అవుతానని వ్యాఖ్యానించారు.
ఇటీవల ఎర్ర శేఖర్‌ను తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకుంటున్నారన్న సమాచారంపై కూడా అనిరుధ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా ఆయన సీఎంను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకున్నది. ‘సంచులు మోసే వాళ్లు మా పార్టీకి అక్కర్లేదు. ఫ్యాక్షనిస్టులకు మా పార్టీలో స్థానం లేదు. సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడిని చంపిన వ్యక్తిని మా పార్టీలోకి తీసుకోం. రేపు ఎమ్మెల్యే టికెట్ కోసం నన్ను కూడా చంపుతాడు. జెడ్ క్యాటగిరీ భద్రత అడగలేను కదా? మా టీపీసీసీ చీఫ్‌ను, సీఎంని కలిసి జెడ్ క్యాటగిరీ అడగాలా? ఇలాంటి వాళ్ల కోసం? సీఎం రేవంత్‌కు, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ఓ క్లారిటీ ఉన్నది. వస్తా అని గేట్ దగ్గరికి వెళ్లిన ఆయనకు అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ఇప్పుడు అందరం ప్రశాంతంగా ఉన్నాం. నాతోపాటు మహబూబ్‌నగర్, నారాయణపేట ఎమ్మెల్యేలు కూడా క్లారిటీ ఇచ్చారు. మీడియాలో పబ్లిసిటీ చేసుకొని వచ్చే వాళ్లకు కాంగ్రెస్‌లో స్థానం లేదు’ అని జడ్చర్ల ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు.
నేను కూడా సీఎం అవుతా!
సొంత ప్రభుత్వంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
మంత్రుల జిల్లాలు, వారి నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయి
ప్రజలు గెలిపిస్తేనే కదా ఎమ్మెల్యే, మంత్రులు, సీఎం అయ్యేది
ఇంకో రెండుసార్లు గెలిపించండి, నేను కూడా సీఎం అభ్యర్థి… pic.twitter.com/9tsgY6Tf8a
— Telugu Scribe (@TeluguScribe) October 17, 2025
మోసం చేసిన వాళ్లను తిరిగి పార్టీలోకి తీసుకోబోమని ఎన్నికల ముందు చెప్పడం జరిగిందని గుర్తుచేశారు. ఇప్పటివరకు ఫ్యాక్షన్ రాజకీయాలు లేవని ప్రజలు మాట్లాడుకుంటున్నారని, తిరిగి ఆయన పార్టీలోకి వస్తామంటే ఐదుగురు ఎమ్మెల్యేలం ఒప్పుకొనే పరిస్థితి లేదని స్పష్టంచేశారు. ఆయన పరోక్షంగా సీఎం రేవంత్‌కు కూడా చురకలంటించారు.