మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 11:11:16

రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రిగా గర్వపడుతున్నా : కేటీఆర్‌

రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రిగా గర్వపడుతున్నా : కేటీఆర్‌

హైదరాబాద్‌ : రాజన్న సిరిసిల్ల జిల్లాకు కాళేశ్వరం జలాలు రావడంతో.. ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. కరువు ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్పష్టమైన మార్పు కనబడింది అని ఆయన పేర్కొన్నారు. నీటిపారుదల, వ్యవసాయ రంగాల్లో ఎంతో మార్పు కనిపిస్తోందన్నారు. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రిగా ఎంతో గర్వపడుతున్నాను. జిల్లాలో భూగర్భ జలాలు ఏడాదిలోనే ఆరు మీటర్ల మేర పెరిగాయని కేటీఆర్‌ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రణాళికలకు ఇదే నిదర్శనమని కేటీఆర్‌ చెప్పారు. 


logo