తాన్యదేశాయ్, అంకిత్‌రాజ్, కావ్యరెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘స్ట్రీట్ లైట్’. విశ్వ దర్శకుడు. మామిడాల శ్రీనివాస్ నిర్మాత. ఈ చిత్ర ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లో నిర్మాత సి.కల్యాణ్ విడుదలచేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘పెద్ద మనుషులుగా చెలామణి అయ్యే వారి జీవితాల్లోని చీకటి కోణాలను ఆవిష్కరిస్తూ రూపొందిన చిత్రమిది. క్రైమ్, లవ్, రొమాన్స్ అంశాలకు ఓ యువతి ప్రతీకారాన్ని జోడించి తెరకెక్కించాం. అంతర్లీనంగా చక్కటి సందేశం ఉంటుంది’ అన్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఈసినిమాను విడుదలచేయబోతున్నామని నిర్మాత తెలిపారు. రామ్‌గోపాల్‌వర్మకు మించి ఆలోచిస్తూ దర్శకనిర్మాతలు చేసిన ప్రయత్నమిదని సి.కల్యాణ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
కన్నడ నటి ప్రతిమాదేవి కన్నుమూత
‘పుష్ప’తో గుర్తుండిపోయే బహుమతి ఇచ్చారు