Gujarat | యూసీసీ అమలు చేయనున్న గుజరాత్.. చట్టానికి రాష్ట్రపతి ఆమోదం.. దేశంలో రెండో రాష్ట్రం
Gujarat : యూసీసీ (యునిఫాం సివిల్ కోడ్) చట్టాన్ని గుజరాత్ రాష్ట్రం అమలు చేయబోతుంది. దీనిపై గుజరాత్ అసెంబ్లీలో గత మార్చిలో చేసిన తీర్మానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా ఆమోదించారు.
Gujarat : యూసీసీ (యునిఫాం సివిల్ కోడ్) చట్టాన్ని గుజరాత్ రాష్ట్రం అమలు చేయబోతుంది. దీనిపై గుజరాత్ అసెంబ్లీలో గత మార్చిలో చేసిన తీర్మానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా ఆమోదించారు. దీంతో ఈ చట్టం రాష్ట్రంలో అమలులోకి రానుంది. యూసీసీని అమలు చేయబోతున్న రెండో రాష్ట్రంగా గుజరాత్ నిలవబోతుంది. ఇంతకుముందు మొదటిసారిగా ఉత్తరాఖండ్ ఈ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు గుజరాత్ కూడా ఈ చట్టాన్ని అమలు చేయబోతుంది.
ద గుజరాత్ యునిఫాం సివిల్ కోడ్ బిల్, 2026 పేరిట ఈ బిల్లును సీఎం భూపేంద్ర పటేల్ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందది. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో ఇకపై వివాహం, సహజీవనం, ఆస్తి పంపకాలు వంటివన్నీ ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ విషయాల్లో కొత్త రూల్స్ అమలవుతాయి. యూసీసీ ప్రకారం చట్టంలో రానున్న కీలక మార్పులివే. గిరిజన తెగలకు మినహా అందరికీ ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం వారసత్వపు ఆస్తి హక్కు విషయంలో స్త్రీలు, పురుషులకు సమాన హక్కులుంటాయి.
అంటే, కొడుకుకైనా, కూతురుకైనా ఆస్తి విషయంలో సమాన హక్కు ఉంటుంది. ఎవరైనా సహజీవనం చేస్తే ఇకపై రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. అలా చేయకుండా సహజీవనాన్ని కొనసాగించినా కూడా నేరమే. పెళ్లిళ్లతో సమానంగా సహజీవనాన్ని కూడా నమోదు చేసుకోవాల్సిందే. విడాకులు కూడా చట్టబద్ధంగా జరగాల్సిందే. సహజీవనం విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కీలకంగా చెప్పుకోవాలి. తాము సహజీవనానికి వ్యతిరేకం కాదని సీఎం భూపేష్ పటేల్ చెప్పారు.
అయితే, ఈ విషయంలో మహిళల హక్కులకు ప్రాధాన్యం ఇస్తామని, అందువల్లే సహజీవనానికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేలా చట్టం తెచ్చామన్నారు. రాష్ట్రంలో మహిళలు అందరికీ సమాన హక్కులు ఉంటాయని, మత పరంగా ఎలాంటి మినహాయింపు ఉండదని సీఎం అన్నారు. అన్ని మతాలవారికి సమానంగా యూసీసీ చట్టం వర్తిస్తుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

