అమ్మాయి ప్రేమను అందంగా ఆవిష్కరించిన పాట
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల మేళవింపుతో రూపొందుతున్న హాస్యభరిత కుటుంబ కథాచిత్రం ‘ఇడుపు కాయితం’. ప్రియదర్శి, తెలంగాణ జానపద గీతాల ద్వారా పేరు తెచ్చుకున్న నాగదుర్గ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి వంశీరెడ్డి దొండపాటి దర్శకుడు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల మేళవింపుతో రూపొందుతున్న హాస్యభరిత కుటుంబ కథాచిత్రం ‘ఇడుపు కాయితం’. ప్రియదర్శి, తెలంగాణ జానపద గీతాల ద్వారా పేరు తెచ్చుకున్న నాగదుర్గ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి వంశీరెడ్డి దొండపాటి దర్శకుడు. బన్నీ వాస్ నిర్మాత. డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ‘ఉల్లిపూల..’ లిరికల్సాంగ్ని మేకర్స్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్లో హీరో ప్రియదర్శి మాట్లాడుతూ ‘ప్రేమలో ఉన్న అమ్మాయి చూసే ప్రపంచం కొత్తగా ఉంటుంది. రోజంతా ఆనందంగా కనిపిస్తారు. ఈ పాటలో తన సాహిత్యంతో ఆ అనుభూతిని పలికించారు శ్రీనివాస్. ఇక సురేశ్ బొబ్బిలి అయితే అద్భుతంగా కంపోజ్ చేశాడు. త్వరలో మరో పాట రాబోతున్నది. అది కూడా గొప్పగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. ‘కథ, సంగీతం కలిస్తే ఎంత బాగుంటుందో ఈ సినిమాలో చూశాను. ‘ఇడుపు కాయితం’ అనే టైటిల్ చూసి ఇది సీరియస్ సబ్జెక్టని అంతా అనుకుంటున్నారు.
నిజానికి ఆద్యంతం వినోదాత్మకంగా ఉండే సినిమా ఇది. 2గంటల 41 నిమిషాలు ఆడియన్స్‌ని ఎంగేజ్ చేస్తుంది. అంతా హ్యాపీగా థియేటర్ల నుంచి బయటకొస్తారు’ అని నిర్మాత బన్నీ వాసు తెలిపారు. తాము ప్రమోషనల్ కంటెంట్‌లో చూపించింది చాలా తక్కువని, అసలైన కంటెంట్‌ని తెరపై త్వరలోనే చూస్తారని కథానాయిక నాగదుర్గ చెప్పారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

