దీక్షా దివస్..తెలంగాణ పునరంకిత జోష్
దీక్షా దివస్.. తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షను మలుపుతిప్పిన రోజు. ప్రపంచమంతా తెలంగాణ వైపు తిరిగి చూడటం మొదలుపెట్టిన రోజు. తెలంగాణ తిరగబడితే ఎట్లా ఉంటదో కేసీఆర్ దేశానికి తెలియజెప్పిన రోజు.
- యావత్ తెలంగాణ బరిగీసి నిలబడిన రోజు
- గల్లీ నుంచి ఢిల్లీ దాకా మార్మోగిన సందర్భం
- మరో ఉద్యమ సంకల్పానికి తెలంగాణ ప్రతిన
వరంగల్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దీక్షా దివస్.. తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షను మలుపుతిప్పిన రోజు. ప్రపంచమంతా తెలంగాణ వైపు తిరిగి చూడటం మొదలుపెట్టిన రోజు. తెలంగాణ తిరగబడితే ఎట్లా ఉంటదో కేసీఆర్ దేశానికి తెలియజెప్పిన రోజు. ‘ఆవాజ్.. దో.. హమ్ ఏక్ హై’ అని కేసీఆర్ నాయకత్వంలో యావత్ తెలంగాణ బరిగీసి నిలబడిన రోజు. తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా కేసీఆర్ పూరించిన శంఖారావం గల్లీ నుంచి ఢిల్లీ దాకా మార్మోగిన సందర్భం. 2010 నవంబర్ 29 నుంచి ఏటా తెలంగాణ దీక్షా దివస్‌ను పాటిస్తున్నది.
2014 జూన్ 2కు నేపథ్య చరిత్రను గుర్తుచేసుకుంటున్నది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఆత్మగౌరవం, స్వయం పాలన, సమాన అవకాశాల కోసం సాగిన పోరాటాన్ని మననం చేసుకొని ప్రస్తుత కర్తవ్యాలను గుర్తుచేస్తున్నది. విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, కార్మికులు, రైతులు, మహిళలు ఇలా అన్నివర్గాల అబాల తెలంగాణ దీక్షా దివస్ నేపథ్యంగా మరో ఉద్యమానికి సన్నద్ధం అవుతున్నది. మూడేండ్లుగా తెలంగాణ ఆశలు.. ఆకాంక్షలు.. మన ఆత్మగౌరవాన్ని రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తున్న వైనంపై కన్నెర్రజేస్తున్నది. ప్రజాకవి కాళోజీ కవితాపాదాలను వల్లెవేస్తే ‘కాలంబు రాగానే కాటేసితీరాలె’ అన్నట్టుగా కాలం కోసం తెలంగాణ సమాజం ఎదురుచూస్తున్నది.
ఎడారిలో ఎదురెక్కిన చేపలు
ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన యావత్ తెలంగాణ సమాజం తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలన ఉద్యమ ఆకాంక్షలకు అనువైన కార్యాచరణ అమలు చేసింది. ఉమ్మడి పాలకుల కుట్రల ఫలితంగా ఎడారి సదృశ్యం గా మారిన తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో ఎదురొచ్చే చేపపిల్ల అయింది. పడావుపడి.. పల్లెర్లు మొలిచి న తెలంగాణ పచ్చని పంటలతో తులతూగింది. బుక్కెడు బువ్వ కోసం పరితపించిన తెలంగాణ దేశాని కే అన్నంపెట్టే అన్నపూర్ణగా మారింది. పంజాబ్‌ను తలదన్నేరీతిలో ధాన్యం పండించింది.
నీరులేక గొంతులెండిన నేలతల్లి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ వంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రన్నింగ్ ప్రాజెక్టులుగా మలిచింది. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంతో తుమ్మలు.. జిల్లేల్లు మొలిచిన కాలువల్లో ‘ఏటీపాయలా నీటి ఊటలా జోహార్’ అన్నట్టు అమరుల త్యాగాలకు జలనివాళి అర్పించింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రపంచమే నివ్వెరపోయే పసిడి రాసులు కురిపించింది. చిన్నాభిన్నమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు తెచ్చి ఆర్థిక వ్యవస్థను పరిపుష్టంచేసింది. మి ష న్ కాకతీయతో గొలుసుకట్టు చెరువులకు పట్టిన దశాబ్దాల దరిద్రాన్ని దూరం చేసింది. మూడేండ్లు గా రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ తిరిగి ‘ఎప్పటి చిప్ప ఏనుగుల్నే’ అన్నట్టు తయారైంది. తావుకొస్తున్న తెలంగాణ తావుతప్పిపోయినట్టు అవుతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజం పునరాలోచన చేస్తున్నది.
భవిష్యత్ తెలంగాణకు దిశానిర్దేశం
దీక్షా దివస్ అనేది గతాన్ని గుర్తుచేసుకునే ఒక రోజు మాత్రమే కాదు.. అది భవిష్యత్తు తెలంగాణకు దిశానిర్దేశం చేసుకునే సందర్భం కూడా అని ప్రజలు తీర్మానించుకుంటున్నారు. కేసీఆర్ నాయకత్వంలో 2014 నుంచి 2023 దాకా అన్ని రంగాల్లో ‘హవ్వల్ దర్జా’గా గల్లా ఎగిరేసి బతికిన తెలంగాణ ఇవ్వాళ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ‘జీ.. హుజూర్’ అన్నట్టు మోకరిల్లే పాలకులను చూసి ఈసడించుకుంటున్నది. పదేండ్లు తల‘సిరు’లు కురిపించిన ‘తల’వంపులు తెచ్చే కాలాన్ని తెచ్చిన కాంగ్రెస్, బీజేపీలపై దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ సమాజం ‘గులాల్’ జెండా ఎగురవేసేందుకు సిద్ధమవుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

