దీక్షా దివస్‌కు సిద్ధం
సిటీబ్యూరో: స్వరాష్ర్టాన్ని సాకారం చేసేందుకు 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమంలో కలికితురాయిలా నిలిచింది. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ తెచ్చుడో.. అనే నినాదంతో అకుంటిత దీక్షతో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం యావత్ తెలంగాణ సమాజంలో ఉద్యమ స్ఫూర్తి రగిలించింది. నాటి తెలంగాణ ఉద్యమ కీలక ఘట్టాన్ని భావితరాలకు అందించేందుకు నవంబర్ 29ని దీక్షా దివస్‌గా జరుపుకొంటున్నాం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకునే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నేడు నగరవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ వాదులు, కవులు, కళాకారులు, మేధావులు దీక్షా దివస్ నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. నగరంలోని ప్రతి డివిజన్ ప్రతి బస్తీ, ప్రతి కాలనీలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు పనిచేశారు. ఈనేపథ్యంలో దీక్షా దివస్‌ను పురస్కరించుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దీంతో సిటీ నుంచి పెద్ద ఎత్తున కరీంనగర్ తరలివెళ్తున్నారు. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తిని రగిలించేలా సభను విజయవంతం చేసేందుకు వేలాదిగా కదలి వెళ్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు కరీంనగర్ తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- BRS
- deeksha divas
- KCR
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

