మంగళవారం 02 జూన్ 2020
Telangana - Feb 19, 2020 , 02:09:33

ఐటీ వినియోగంలో సింగరేణి దేశంలోనే టాప్‌

ఐటీ వినియోగంలో సింగరేణి దేశంలోనే టాప్‌
  • డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ
  • ఆర్‌ సుబ్రహ్మణియన్‌

హైదరాబాద్‌/మంచిర్యాల ప్రతినిధి, నమస్తేతెలంగాణ: ఐటీ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) వినియోగంలో సింగరేణి దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని, అదే సమయంలో బొగ్గు ఉత్పత్తి, టర్నోవర్‌ సాధించడంలోనూ ఆదర్శంగా నిలుస్తున్నదని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ ఆర్‌ సుబ్రహ్మణియన్‌ అన్నారు. హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్యభవన్‌లో మంగళవారం నిర్వహించిన.. ‘మైనింగ్‌లో ఐటీ వినియోగం - ముందడుగు’ సదస్సులో ఆయన ప్రసంగించారు. రానున్నకాలంలో ఐటీ వినియోగాన్ని విస్తృత పరుస్తూ, అత్యాధునిక టెక్నాలజీతో ఉత్పత్తులు సాధిస్తూ 2024 నాటికి 100 మిలియన్‌ టన్నుల లక్ష్యం సాధించాలని ఆకాంక్షించారు. డైరెక్టర్‌ (ఈఅండ్‌ఎం) ఎస్‌ శంకర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో కోల్‌ ఇండియా కంపెనీల ప్రతినిధులు, సింగరేణి డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమర్రిలోని ట్రైనింగ్‌ సెంటర్‌ను హైదరాబాద్‌ నుంచి రిమోట్‌ ద్వారా సుబ్రహ్మణియన్‌ ప్రారంభించారు. 


logo