మహబూబ్నగర్ : స్వాతంత్య్రం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్న ఇంకా దేశంలో కులాల వివక్ష ( Caste discrimination ) , అసమానతు కొనసాగడం బాధాకరమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) అన్నారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ ( BRS ) పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురువేసి మాట్లాడారు.
ఎంతో మంది మహనీయుల త్యాగాలతో స్వాతంత్రము వచ్చిందని, ఆర్ధికంగా, సామాజికంగా అందరు అభివృద్ధి చెందాలని వారు కోరుకున్నారని అయితే ఇంకా అత్యాచారాలు, వరకట్న వేధింపులు, కులాల వివక్ష, అసమానతలు కనిపిస్తుండడం బాధ కలుగుతుందని పేర్కొన్నారు. వీటిని రూపుమాపాల్సిన అవసరం ఉందని అన్నారు. మనకంటే చిన్న చిన్న దేశాలు ఆర్ధికంగా అభివృద్ధి అవుతున్నాయి. దేశం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెల్లడించారు.
స్వదేశీ వస్తువులను వాడాలి. ఇతర దేశాల నుంచి వచ్చిన వస్తువుల కొనుగోలు తగ్గించాలని సూచించారు. భారత దేశంపై ఆధారపడి చాలా దేశాలు ఉన్నాయని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్టాన్ని అన్ని రంగాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లిందని గుర్తు చేశారు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ ఇచ్చినట్టే స్థానిక సంస్థల్లో కూడా వారికీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న ,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు శివరాజ్, మహబూబ్ నగర్ మండల పార్టీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు గిరిధర్ రెడ్డి గణేష్, అనంత రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాసులు, నవకాంత్, రామలక్ష్మణ్, అన్వార్ పాష, నరేందర్, మోసిన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.