Bathukamma Sarees | బంజారాహిల్స్, సెప్టెంబర్ 24: ప్రభుత్వం ఈ పండుగకు కూడా బతుక మ్మ చీరలు ఇవ్వడం అసాధ్యమేనని తెలుస్తున్నది. బుధవారం బంజారాహిల్స్ డివిజన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు అద్భుతమైన చీరలు ఇవ్వాలని ప్రభుత్వం భా వించిందని, చేనేత కళాకారులు సకాలం లో అందించలేకపోతున్నారని ఆమె పే ర్కొన్నారు. త్వరలోనే మహిళా పొదుపు సంఘాల సభ్యులందరికీ చీరలు పంపిణీ చేస్తామని చెప్పారు. 8 ఏండ్ల పాటు నిరాటకంగా కొనసాగిన బతుకమ్మ చీరల పంపిణీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిలిపివేసింది.
మంత్రుల సమావేశంలో కరెంట్ కట్
నగరం నడిబొడ్డున బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన మహిళాభవన్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని సమావేశం నిర్వహించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు వందలాదిమంది మహిళలు, స్థానికులు పాల్గొన్న ఈ సమావేశంలో 20 నిమిషాల పాటు కరెంట్ కట్ అయ్యింది. దీంతో స్థానిక విద్యుత్ అధికారులపై మంత్రి పొన్నం ప్రభాకర్ అసహనం వ్యక్తం చేశారు.