Congress | హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఒక విధంగా.. ప్రతిపక్షంలో ఉంటే మరో విధంగా ప్రవర్తిస్తుందని మరోసారి నిరూపితమైంది. అధికారంలో ఉన్నప్పుడు తనకు అనుకూలం గా నిబంధనలను మార్చుకొని.. ఇప్పుడు అధికారం కోసం వాటిని తుంగలో తొక్కుతున్నది. అధికారం దక్కించుకోవాలనే తాపత్రయంలో కపట వేషాలు వేస్తున్నది. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నియమావళిలో కొన్ని మార్పులు చేసింది. కోడ్ అమల్లోకి వచ్చినా ఏయే పను లు, పథకాలను కొనసాగించవచ్చో స్పష్టంగా చెప్పింది. పైగా వీటిని కొనసాగించడానికి ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
1) అన్ని రకాల అనుమతులు పొంది అప్పటికే పనులు ప్రారంభమైన ప్రాజెక్టులను కొనసాగించవచ్చు.
2) ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేనాటికే లబ్ధిదారులను ఎంపిక చేసిన పథకాలను కొనసాగించవచ్చు.