హైదరాబాద్, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ) : కొత్త రేషన్ కార్డుల జారీకి ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన, గ్రామసభలు, మీసేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులు, కులగణన వివరాల ద్వారా అర్హులను ఎంపిక చే యాలని సూచించారు. హైదరాబాద్‌లో సోమవారం రేషన్‌కార్డుల జారీపై అధి కారులతో సమీక్ష సమావేశం నిర్వ హించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పారు. ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో ముందుగా, కోడ్ ముగిసిన తర్వాత అన్ని జిల్లాల్లో కార్డులు జారీ చేయాలని సూచించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఐదేండ్ల తర్వాత కాంగ్రెస్ నుంచి బీసీ ముఖ్యమంత్రి అవుతాడని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. గాంధీభవన్‌లో సోమవారం జరిగిన పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏదో ఒక రోజు తెలంగాణలో బీసీ అభ్యర్థి సీఎం అవుతారని, అది కాంగ్రెస్ పార్టీ నుంచేనని పేర్కొన్నారు. ఈ ఐదేండ్లు రేవంత్‌రెడ్డే రాష్ట్ర సీఎంగా ఉంటారని చెప్పారు.