హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
ప్రజలను అయోమయానికి గురిచేసేలా ప్రజాప్రతినిధుల ఫొటోలతో వచ్చే ఈ ప్రకటనలను ఎవరు ప్రచారంలోనికి తీసుకురావద్దని పేరొన్నారు. కొత్త రేషన్‌కార్డులు, పాత కార్డుల్లో మార్పులపై వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు.