CM Revanth Reddy | అభ్యర్థులను ఖరారు చేసేది రేవంతేనా?.. ఎంపీ టికెట్ల కసరత్తు అంతా ఒట్టిదేనా?
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసేది పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డేనా? అంటే, అవుననే సమాధానం వస్తున్నది. అభ్యర్థుల ఎంపికకు పీసీసీ, ఏఐసీసీ చేస్తున్న కసరత్తు అంతా ఒట్టిదేనని బుధవారం తేలిపోయింది.
- మహబూబ్‌నగర్ అభ్యర్థిగా వంశీచందర్‌రెడ్డి
- కొడంగల్‌లో 50 వేల మెజార్టీ ఇవ్వాలని సీఎం పిలుపు
CM Revanth Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసేది పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డేనా? అంటే, అవుననే సమాధానం వస్తున్నది. అభ్యర్థుల ఎంపికకు పీసీసీ, ఏఐసీసీ చేస్తున్న కసరత్తు అంతా ఒట్టిదేనని బుధవారం తేలిపోయింది. కోస్గిలో నిర్వహించిన బహిరంగ సభలో మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా వంశీచందర్‌రెడ్డి పేరును రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ నుంచే వంశీచందర్‌రెడ్డికి 50 వేల మెజార్టీ ఇచ్చి గెలిపించాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీ టికెట్లను ఏఐసీసీ ఖరారు చేస్తుందంటూ ఇంతకాలం తా ము నమ్మినదంతా ఒట్టిదేనని తేలిపోయిందని ఆశావహులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
అభ్యర్థుల ఎంపిక బాధ్యతను అధిష్ఠానం రేవంత్‌రెడ్డికే అప్పగించి ఉంటే.. పీసీసీ దరఖాస్తులు స్వీ కరించడం, 50 వేల చొప్పున ఫీజు వసూలు చేయడం, డీసీసీల నుంచి ఆశావహుల పేర్లు తెప్పించుకోవడం, వాటిపై ప్రదేశ్ ఎన్నికల కమి టీ కసరత్తు చేయడం, టికెట్ల ఖరారుపై తుది నిర్ణయం కేంద్ర ఎన్నికల స్క్రీనింగ్ కమిటీదే అన్నట్టుగా బిల్డప్ ఇవ్వడం ఎందుకనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎంపీ అభ్యర్థుల ఖరారుకు ఏఐసీసీ కసరత్తు చేస్తున్నదని ఒకవైపు నమ్మిస్తూ, మరోవైపు మహబూబ్‌నగర్ అభ్యర్థిగా వంశీచందర్‌రెడ్డి పేరును ప్రకటించడంతో ఆశావహులు కంగుతిన్నారు. టికెట్ల ఎంపికకు కసరత్తు జరుగుతున్నట్టు పీసీసీ, ఏఐసీసీ తమను నమ్మించి మోసం చేస్తున్నాయని లబోదిబోమంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

