హైదరాబాద్, జూలై22 (నమస్తే తెలంగాణ): నీటిపారుదల శాఖలో బదిలీల అంశం ఇంజినీర్ల మధ్య రగడకు దారితీస్తున్నది. హైదరాబాద్ సర్కిల్లో చేపడుతున్న బదిలీలపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. జీవో 80 ప్రకారం కౌన్సెలింగ్ చేపట్టాలని, ఆప్షన్స్ పెట్టుకున్న ఉద్యోగుల అభిప్రాయాలు తెలుసుకోవాలని స్పష్టంగా నొక్కిచెప్పింది. యూనిట్ పరిధిలో ఉన్న సరిల్స్కి, డివిజన్స్ జాబితాను విడుదల చేశారు. అందులో ఆయా కార్యాలయాల వారు తమ అభిప్రాయాలను, వర్ లోడ్, వారి కార్యాలయంలో అనుభవమున్న ఉద్యోగుల అవసరం తదితర వివరాలను నిబంధనల మేరకే సమర్పించారు.
ఆచరణలో నివేదికను తుంగలో తొకారని ఇరిగేషన్ ఇంజినీర్లు, ఉద్యోగులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ యూనిట్లో ఉన్న కార్యాలయాల్లో అర్హతలు, అనుభవమున్న అధికారులను కాదని, జూనియర్లకు అవకాశం కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో చీఫ్ ఇంజినీర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ సూపరింటెండెంట్ చక్రం తిప్పుతున్నారని ఆరోపిస్తున్నారు. సదరు ఉద్యోగి ఇప్పటికే అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయినా తీరు మార్చుకోవడంలేదని మండిపడుతున్నారు. ప్రభుత్వం బదిలీలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.