TG DGP | తెలంగాణ డీజీపీగా జితేందర్ నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
TG DGP | తెలంగాణ రాష్ట్ర డీజీపీగా జితేందర్ నియామకయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది.
TG DGP | తెలంగాణ రాష్ట్ర డీజీపీగా జితేందర్ నియామకయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. జితేందర్ 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్మల్ ఏఎస్పీగా పని చేశారు. ఆ తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాకు ఎస్పీగానూ సేవలందించారు. ఢిల్లీలో సీబీఐలో కొంతకాలం పనిచేశారు.
2004-06 మధ్య గ్రేహౌండ్స్ బాధ్యతలుచేపట్టారు. విశాఖపట్నం రేంజ్ డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా పనిచేశారు. ఏపీ సీఐడీ, ఎంక్వైరీ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో పని చేశారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో అదనపు ట్రాఫిక్ కమిషనర్, తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్లశాఖ డీజీగా పని చేశారు. ప్రస్తుతం ఆయన హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు.
Read Me Also :
- VRP | తెలంగాణ సచివాలయం ముందు విద్యార్థుల రాజకీయ పార్టీ ఆందోళన
- Harish Rao | జర్నలిస్టును అరెస్టు చేయడం.. మీడియా హక్కును కాలరాయడమే : హరీశ్‌రావు
- KTR | ఓయూలో జర్నలిస్టు అరెస్టు.. కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులు చెరిగిన కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

