హైదరాబాద్, జూన్ 1(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాల్సిందిగా గవర్నర్ రాధాకృష్ణన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం ఉదయం వారిద్దరు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వేడుకలకు రావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను, కార్యక్రమాలను గవర్నర్ అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. సుమారు 30 నిమిషాలపాటు గవర్నర్‌తో భేటీ అయిన సీఎం, డిప్యూటీ సీఎం పలు అంశాలపై చర్చించినట్టు తెలిసింది. ముఖ్యంగా యూనివర్సిటీలకు వీసీల నియామకంపై చర్చించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే తీసుకున్న చర్యల్ని గవర్నర్‌కు వివరించినట్టు తెలిసింది.