Telangana | హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగా ణ): ‘అధికార పక్షాన ఉంటే.. అనుకున్నది సా ధించుకోవచ్చు’ అని ఆశపడి గోడ దుంకిన ఎ మ్మెల్యేలకు ఆశాభంగమే అయిందా? అటు ప నులు చేసుకోలేక.. ఇటు పరువు నిలబెట్టుకోలే క తమ నియోజకవర్గాల్లో ఆ పది మంది తిరగలేకపోతున్నారా? అంటే.. ‘అవును’ అన్నదే సమాధానం! ‘ఇది గ్యారెంటీగా మోసమే.. ప్ర జలకు ఇచ్చిన హామీల సంగతేమోగానీ మాకు ఇచ్చిన మాటయితే నిలబెట్టుకుంటరనుకు న్నం. అదీ లేదు.. ఇదీ లేదు.. రెంటికీ చెడ్డరేవడిలా మా పరిస్థితి తయారైంది’ అని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఓ సీనియర్ ఎమ్మె ల్యే వాపోవడం వారి పరిస్థితిని బయటపెడుతున్నది.
ఇలా ఒకరిద్దరు కాదు.. పార్టీ మారిన 10 మంది, ఆరుగురు ఎమ్మెల్సీలదీ అదే దు స్థితి అని తెలుస్తున్నది. ‘కండువా మారేదాకా వెంటపడ్డరు.. ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకున్నపాపాన పోవటంలేదు’ అని వాపోతున్నా రు. పార్టీలో చేరిన సమయంలో ఇచ్చిన హామీ ల్లో ఒకరిద్దరికి హామీని నిలబెట్టుకున్నా, మిగతా వారికి మొండిచెయ్యే చూ పారు. అందరికీ ‘అజ్ఞాతబంధువు’ ఆశీస్సులు ఉండవు కదా? అని వారే నిట్టూరుస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అటుంచితే.. కనీసం తమను కలిసేందుకు కూడా ముఖం చాటేస్తున్నారని, పైపెచ్చు ‘వీళ్లను ఎప్పుడు ప డితే అప్పుడు రానియ్యొద్దని చెప్పిన కదా.. మ ళ్లీ ఎందుకు రానిస్తున్నరు’ అని ప్రభుత్వ పెద్ద తన వ్యక్తిగత నీడకు హుకుం జారీ చేశారని చెప్తున్నారు.
ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తెల్లం వెంకట్రావు, సంజయ్‌కుమార్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికెపూ డి గాంధీ, గూడెం మహిపాల్‌రెడ్డి ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అ యితే, బీఆర్ఎస్ను జీరో చేస్తామని, అసలు ఆ పార్టీ అంటూ ఉండదని, ఆ పార్టీలో ఉండి చేసేదేమీ లేదని కాంగ్రెస్‌లో చేరండి అని కాంగ్రెస్ పెద్దలు ఇల్లిల్లూ తిరిగి ఆహ్వానాలు పలికారు.
స్వయంగా వీరందరినీ సీఎం రేవంత్‌రెడ్డి కాం గ్రెస్‌లోకి ఆహ్వానించారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ చేరుతున్నవారికి ఎదురులేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరి స్థాయిని బట్టి వారి కమిట్మెంట్కు అనువైన అవకాశం కల్పిస్తానని వాగ్దానం చేసి, కండువా మారిన తెల్లా రి నుంచే తమను పట్టించుకోవటం మానేశారని వారు వాపోతున్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేరే సమయంలో క్యాబినెట్ మం త్రి హోదాతోపాటు, అన్ని రకాలుగా ‘రోజువారీ’ రాయబారాలకు ఇబ్బంది లేకుండా చే స్తామని హామీ ఇచ్చారని, తీరా అమలు విషయానికి వచ్చేసరికి మొదట్లో సూపర్‌హిట్ సినిమాను తలపించినా తర్వాత బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డట్టయిందని ఆయన గుర్రుగా ఉన్నట్టు స న్నిహితులే చెప్తున్నారు.
ఇక ఇచ్చిన పదవి విషయంలోనూ ‘పండ్లులేని నోటికి వెలగపండు ఇచ్చి కొరుక్కుతినుమన్నట్టే ఉంది’ అని ఆయన మథనపడుతున్నట్టు తెలిసింది. చేరిక ఒప్పందంలో కీలక హామీ.. బకాయిలానే ఉన్నదని, ప్రజల ముందు బకరా అయినట్టు పరిస్థితి ఉన్నదని తన సన్నిహితులతో ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే ఆవేదన వెల్లగక్కినట్టు తెలిసింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, దా నం నాగేందర్, ప్రకాశ్‌గౌడ్, కడియం శ్రీహరి పరిస్థితి కూడా అధ్వానంగా తయారైందని అం టున్నారు.
నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల అంశం ఓ వైపు ఇబ్బందిగా మారితే మరోపైపు తమకు సీఎం రేవంత్‌రెడ్డి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదని మథనపడుతున్నారు. పైపెచ్చు ‘వీళ్లను ఎప్పుడు పడితే అ ప్పుడు రానివ్వద్దు’ అని వీరిలో ముగ్గురిని ఉద్దేశించి వారికి వినపడేలానే పేర్కొనటంతో కం గుతినటం ఆ ఎమ్మెల్యేల వంతు అయిందట! అటు నియోజకవర్గంలో, ఇటు పార్టీలో తమ కు ఎలాంటి ప్రాధాన్యత లేక, తాము చేరిన ప్రయోజనం నెరవేరుతుందన్న నమ్మకం లేక పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రజల్లో కనిపించ టం లేదని అంటున్నారు.
అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితోపాటు మరో ఇద్ద రు ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలిసి తాము కాంగ్రెస్‌లో ఇమడలేకపోతున్నామని, తిరిగి బీఆర్ఎస్లోకే వస్తామని మంతనాలు సాగించిన విషయం బయటికి పొక్కింది. మీడియాలో ఆ భేటీ పతాకస్థాయి కావడంతో పరిస్థితిని పసిగట్టిన సీఎం, మంత్రి జూపల్లి కృష్ణారావును రంగంలోకి దింపి కృష్ణమోహన్‌రెడ్డి ఇంటికి రాయబేరం నెరపటంతో అప్పటికప్పుడు ఘర్‌వాపసీకి బ్రేకులు పడ్డా యి. ఇదే అదనుగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు అల్టిమేటం జారీ చేయడంతో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నపళంగా రంగంలోకి దిగి ఎమ్మె ల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో ‘కిం కర్తవ్యం’ భేటీ నిర్వహించారు. ఫలితంగా ఒకరిద్దరికి పదవులు దక్కినా అవీ ‘గురువు’ ఆదేశాలతోనేననే ప్రచారం జరుగుతున్నది.
పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. గాంధీభవన్‌కు వెళ్లలేరు.. సీఎంను నేరుగా కలువలేరు అన్నట్టు తయారైంది. జగిత్యాల, గద్వాల, ప టాన్‌చెరు, చేవెళ్ల, స్టేషన్‌ఘన్‌పూర్, ఖైరతాబా ద్, బాన్సువాడ సహా దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వర్సెస్ చేరికవర్గం మధ్య తీవ్ర అగాథం నెలకొన్నది. స్థానిక నేత ల మధ్య పొసగని బంధం పోరు కుంపట్లను రాజేస్తున్నది. బయటకు సుస్థిర ప్రభుత్వమని చెప్తున్నా లోపల అస్థిర కాంగ్రెస్‌గా మారిపోయిందని, ఒకవేళ అనర్హత వేటుపడితే తమ రాజకీయ భవిష్యత్తుకు తామే సమాధి కట్టుకునట్టు అవుతుందని సదరు ఎమ్మెల్యేలు తీవ్రగందరగోళానికి గురవుతున్నట్టు తెలిసింది.