హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): హిమాచల్ ప్రదేశ్‌లో 100 మెగావాట్లకు పైబడి సామర్థ్యం గల హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులపై తెలంగాణ ఆసక్తి వ్యక్తంచేసింది. ఈ మేరకు గురువారం హిమాచల్‌ప్రదేశ్ సీఎం సఖుతో డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరురాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముసాయిదాను పంపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార హిమాచల్‌ప్రదేశ్ సీఎంను కోరారు.
హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): ఎన్నిసార్లు ఆదేశించినా సొంత నియోజకవర్గంలోనే పనులు మొదలు పెట్టకపోతే ఎలా? ఇక రాష్ట్రంలో పరిస్థితి ఏంటి అంటూ ఇరిగేషన్‌శాఖ అధికారులపై సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సూర్యాపేట జిల్లాలో పలు లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సంబంధించిన పనులను ఇప్పటికీ అధికారులు గ్రౌండింగ్ చేయకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఎలా? అంటూ నిప్పులు చెరిగారు.