హైదరాబాద్ : ప్రజల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీతో పాటు కార్పొరేషన్లలో సకల హంగులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పట్టణాల్లో ఎలాంటి వసతులు లేని ఖాళీ స్థలాలు, ఫుట్పాత్లు, మురుగు కాల్వలపై కూరగాయలు, మటన్, చికెన్, చేపలను అపరిశుభ్ర వాతావరణ పరిస్థితుల్లో విక్రయిస్తున్న సందర్భాలున్నాయి.అయితే, దీనికి చెక్ పెట్టేందుకు అత్యాధునిక వసతులతో సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణానికి సంకల్పించింది.
అదేవిధంగా రాష్ట్రంలోని మరో 13 మున్సిపాలిటీల్లో సమీకృత వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇతర పట్టణాల్లో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. pic.twitter.com/EspGqTKq55
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 16, 2023
ఈ మేరకు ప్రభుత్వం ఒక్కో మార్కెట్ నిర్మాణానికి రూ.కోటికిపైగా నిధులు కేటాయించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ మార్కెట్లు అందుబాటులోకి రాగా.. పలుచోట్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి.
నల్గొండ పట్టణంలో నిర్మిస్తున్న సమీకృత వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్నది. 10/n pic.twitter.com/TEdMPx9HAY
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 16, 2023
భువనగిరి మున్సిపాలిటీలో నిర్మించిన ఆధునిక సమీకృత వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ సముదాయం. 9/n pic.twitter.com/wElVecs5vi
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 16, 2023
సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్లలో పండ్లు, పూలు, మటన్, చికెన్ చేపలను విక్రయించేందుకు కూడా ప్రత్యేకంగా దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు.
సిద్దిపేట పట్టణంలో కూరగాయలు, పండ్లు, మాంసం అన్నీ ఒకే ప్రాంగణంలో లభించేలా నిర్మించిన సమీకృత వెజ్ & నాన్ వెజ్ మార్కెట్. 8/n pic.twitter.com/iRJEffqAtr
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 16, 2023
కూరగాయలకు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో సూపర్ మార్కెట్లను సైతం పెట్టేందుకు ప్రతిపాదించారు. ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్లో విక్రయించే కూరగాయలతోపాటు తదితరాలు తాజాగా ఉండేందుకుగాను కోల్డ్ స్టోరేజీలను సైతం నిర్మిస్తున్నారు.
గజ్వేల్ పట్టణంలో ప్రజల సౌకర్యార్థం నిర్మించిన సమీకృత వెజ్ & నాన్ వెజ్ మార్కెట్. 7/n pic.twitter.com/lf346iPqru
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 16, 2023
సిరిసిల్ల పట్టణంలో విశాల ప్రాంగణంలో నిర్మించిన సమీకృత మార్కెట్. 6/n pic.twitter.com/zy2KgF8ROj
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 16, 2023
పట్టణ ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారపదార్థాలు అందించేందుకు తూఫ్రాన్ మున్సిపాలిటీలో నిర్మించిన సమీకృత వెజ్ & నాన్ వెజ్ మార్కెట్. 5/n pic.twitter.com/O2llwVvSQl
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 16, 2023
జహీరాబాద్ మున్సిపాలిటి పరిధిలో నిర్మించిన సమీకృత వెజ్ & నాన్ వెజ్ మార్కెట్. 4/n pic.twitter.com/IxBIoJQnm9
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 16, 2023
ఖమ్మం నగరంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ కాంప్లెక్స్. 3/n pic.twitter.com/Sv70bQABWG
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 16, 2023
నారాయణపేట పట్టణంలో నిర్మించిన ఆధునిక సమీకృత మార్కెట్ సముదాయం ఇటీవలే ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 2/n pic.twitter.com/IfDmi4nhUx
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 16, 2023
ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారపదార్థాలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో సమీకృత వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు చేపట్టింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తవ్వగా, మరి కొన్ని చోట్ల నిర్మాణ దశలో ఉన్నాయి.1/n pic.twitter.com/CY0RbXCqBl
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 16, 2023