హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : మెడికల్ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల ప్రాక్టికల్స్ ఏర్పాట్లలో లోపాలను గుర్తించి, సౌకర్యాలు కల్పించేందుకు ఈ నెల 25 నుంచి 29 వరకు తనిఖీలు నిర్వహించనున్నారు.
మౌలిక వసతులు, లోపాలపై జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు నోటీసులు జారీ చేసింది. దీంతో 10 మానిటరింగ్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు 30న ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నాయి.