KTR | కరీంనగర్, మార్చి7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): “గత పదేండ్లలో ఇంతటి దరిద్రాన్ని చూడలేదు.. కాలం అయినా కాకపోయినా మీరు నీళ్లు ఇచ్చిన్రు. రెండు పంటలకు కాలువల ద్వారా నీళ్లు అచ్చినయి. గట్లనే వత్తయిని వరి ఏసుకున్నం. ఇప్పుడు మా కండ్ల ముందే పొలం పర్రెలు పారుతాంది. అడ్డగోలు ఖర్సులు పెట్టుకున్నం. మాకు చావు తప్ప మరో గతే కనపడుత లేదు” అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందు రైతులు తమ అవేదన వ్యక్తం చేశారు. గురువారం కరీంనగర్లో జరిగిన ముఖ్యనాయకుల సమావేశం అనంతరం కరీంనగర్ మండలం ఇరుకుల్ల గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను పార్టీ శ్రేణులతో కలిసి కేటీఆర్ పరిశీలించారు.
ఎర్ర శ్రీనివాస్ అనే రైతు ఎండి న తన వరిపైరును చూపిస్తూ “సార్ పదేండ్లలో ఇటువంటి దరిద్రాన్ని నేను జూడలే దు. కేసీఆర్ సారు ఉండగా రెండు పం ట లు వేసుకున్న. మస్తు నీళ్లొచ్చినయి. ఇప్పు డు ఇగో జూడు పొలం పర్రెలు పెట్టింది. ఏమి జేయాలో అర్థమైతలేదు. ఎవరిని అడిగినా మాకేమీ తెలువదు అంటుండ్రు. ఎప్పటిలెక్కనే ఈసారి గూడ నీళ్లు వత్తయి అనుకున్నం. ఇంత మోసం అయితదని అ నుకోలే” అంటూ మనసులో గూడుకట్టుకున్న ఆవేదనను కేటీఆర్ ముందు బయటపెట్టాడు. మరో రైతు శ్రీనివాస్‌రెడ్డి మా ట్లాడుతూ “ఇప్పటికే నా రెండెకరాలు ఎం డిపోయింది. ఇంకో రెండెకరాలూ ఎండిపోయేట్టున్నది. పెద్దపల్లికి తీసుకుపోతుం డ్రు గానీ మాకు నీరిస్తలేరు. గింత అన్యాయమా? నాకు మనసున పడతలేదు. మందు తాగి లెటర్ పెట్టి సచ్చిపోతా సర్” అంటూ తన బాధను చెప్పుకొన్నాడు.
రైతుల మాటలకు స్పందించిన కేటీఆర్ వారిని వారించారు. న్యాయం జరిగే వర కు పోరాడతామని హామీ ఇచ్చారు. సమస్యకు చావు పరిష్కారం కాదని, ఎవరూ ఆ ఆలోచనే చేయవద్దని కోరారు. బతికుండి కొట్లాడదామని, ప్రభుత్వాన్ని నిలదీద్దామని పేర్కొన్న ఆయన చావు ఆలోచనను మనసులోకి రానివ్వొద్దని కోరారు.
తోట వేణు అనే రైతు మాట్లాడుతూ వ్యవసాయ బావులకు రాత్రి 11 గంటల నుంచి త్రీఫేజ్ కరెంటు ఇస్తామని అధికారులు మెసేజ్‌లు పెడుతున్నారంటూ తన ఫోన్లోని మెసేజ్‌ను కేటీఆర్‌కు చూపించారు. అక్కడే ఉన్న మరికొందరు రైతులు మాట్లాడుతూ లోవోల్టేజీ కరెంటుతో మో టర్లు కాలిపోతున్నాయని, కరెంటు కోసం బావుల వద్ద మళ్లీ పడుకొనే రోజులు దా పురించాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పంటలు ఎండిపోకుండా తక్షణం సా గునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎస్సారెస్పీ నుంచి సాగునీరు విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరా రు. కరెంటు కోసం రైతులు మళ్లీ రాత్రివేళ బావుల వద్ద నిద్రపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై కక్షతోనే ఎన్డీఎస్ కమిటీ అని కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమస్యకు చావు పరిష్కారం కాదు. ఎవరూ అటువంటి ఆలోచన చేయవద్దు. బతికుండి కొట్లాడదాం. నీళ్లివ్వని ప్రభుత్వాన్ని నిలదీద్దాం. చావు అనే ఆలోచనను మనసులోకి రానివ్వొద్దు. మేమంతా అండగా ఉంటాం. న్యాయం జరిగేవరకు పోరాడుతాం.
-ఇరుకుల్ల రైతులతో కేటీఆర్
కొన్నేండ్ల నుంచి ఎస్సారెస్పీ కా లువ కింద వరివేస్తున్న. ఎన్నడూ ఇం త పంటనష్టం జరగలే. డీ-89 కాలు వ కింద ఈసారి మూడెకరాల్లో వరేసిన. ఈ పదేండ్లు మంచిగ పంటలు పండించిన. ఇప్పుడు కరెంటు ఇబ్బందైతంది. కాలువ నీళ్లు సక్కగ అస్తలేవు. పొట్టకొచ్చిన పంట ఎండుతున్నది. ఏ అధికారి వచ్చి చూసింది లేదు. వారబందీ ప్రకారం నీళ్లు సక్కగ వదిలితే ఈ కరువు వచ్చేది కాదు.
– ఎర్ర శ్రీనివాస్, రైతు, ఇరుకుల్ల, కరీంనగర్ మండలం