ముత్తారం, సెప్టెంబర్ 16: ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అవకతవకలకు పాల్పడ్డారని, అర్హులైన తమకు అన్యాయం చేశారంటూ పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామస్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. గ్రామంలోని వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలపడంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది.
రామగుండం ఏసీపీ మడత రమేశ్ బలగాలతో వచ్చి వారికి నచ్చచెప్పి కిందికి దింపా రు. అర్హులైన ప్రతి ఒకరికీ ఇల్లు వచ్చేలా చూస్తానని ఎంపీడీవో హామీ ఇచ్చారు.