రామగిరి, మార్చి 26: నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ హాస్టల్స్‌లో నెల రోజులుగా నీటి సరఫరా కరువైందని వి ద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా పరిష్కరించకపోవడంతో గురువారం ఉదయం యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్స్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్స్‌కు రావాల్సిన నీటిని వర్సిటీలో నిర్మిస్తున్న నూతన భవనాలకు కాంట్రాక్టర్లు అక్రమంగా తరలిస్తున్నా రని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్, ఏబీవీపీ అధ్యక్షుడు హనుమాన్చారితోపాటు వి ద్యార్థులు రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ధ ర్నా దిగారు.
దీంతో హుటాహుటిన వర్సిటీ ట్యాంకర్‌తో నీటి సరఫరా చేయడంతో విద్యార్థులు ఆరుబయటే స్నానాలు చేశారు. విష యం తెలుసుకున్న రిజిస్ట్రార్ అంజిరెడ్డి, హాస్ట ల్స్ డైరెక్టర్ రమేశ్, అధికారులు చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. కాంట్రాక్టర్‌పై చ ర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు నవీన్, ఏబీవీపీ అధ్యక్షుడు హనుమాన్చారి, ఎంఎస్ఎఫ్ అధ్యక్షుడు మాచర్ల సుధీర్‌తోపాటు విద్యార్థులు వర్సిటీ అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్) కార్యాలయం ఎదుట ధర్నా చేశా రు. సమస్యను పరిష్కరిస్తామని రిజిస్ట్రార్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.