హైదరాబాద్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ): ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి శాశ్వత పరిష్కారం కోసం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని జిల్లాల కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో సచివాలయం నుంచి గురువారం సీఎస్ రామకృష్ణారావుతో కలిసి జిల్లాల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సెలవులోని సిబ్బందిని వెనక్కి పిలిపించాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మున్సిపల్, మెట్రో వాటర్‌బోర్డు, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.