హైదరాబాద్, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ): భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు.
మధ్యాహ్నం 12గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సీఈసీకి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డి సహా ఎన్నికల విభాగం ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. సాయంత్రం ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలానికి బయల్దేరి వెళ్లారు.