Telangana Bhavan | హైదరాబాద్ : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, రావుల చంద్రశేఖరరెడ్డి, మాజీ మంత్రులు మహమూద్ అలీ, రెడ్యానాయక్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అంతకుముందు ఎంపీ రవిచంద్ర తెలంగాణ భవన్‌లోని దివంగత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విగ్రహానికి పూలుజల్లి ఘనంగా నివాళులర్పించారు.