హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. మంగళవారం పటాన్చెరులో అత్యల్పంగా 16.2 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2024 జనవరి సీజన్లో నగరంలో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, ఈ సారి మరింత తకువ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్, నవంబర్ 5(నమస్తే తెలంగాణ): డిప్యూటీ కలెక్టర్, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డికి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆయన్ను సీసీఎల్ఏ అసిస్టెంట్ సెక్రటరీగా నియమిస్తూ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.