రాజన్న సిరిసిల్ల : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై దేశ వ్యాప్తంగా అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. సామాన్యుల నడ్డి విరుస్తూ..కార్పొరేట్లకు ఉపయోగ పడేలా ఉన్న బడ్జెట్‌పై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరును ఎండగడుతూ.. ప్రజలు ఆందోళలు చేస్తున్నారు.
కాగా, బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేశారంటూ టీఆర్ఎస్ యూత్ నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి తెలంగాణకు అన్యాయం చేస్తు్న్నదని మండిపడ్డారు. తెలంగాణకు సరైన కేటాయింపులు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు రోడ్డుపై పడుకొని తమ నిరసన తెలిపారు.