గోదావరిఖని జ్యోతినగర్, మార్చి 30 : కాంగ్రెస్ తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల వేదిక నాయకులు సోమవారం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని నర్రశాలపల్లి రోడ్‌లోని వాటర్ ట్యాంక్ ఎక్కారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోడేటి శంకర్‌గౌడ్, పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి వొల్లాల మల్లేశం, ఉపాధ్యక్షుడు పొన్నం విజయ్‌గౌడ్ 2 గంటల పాటు ట్యాంక్‌పై నిరసన తెలిపారు.
ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్‌కిరణ్ వారితో మాట్లాడి.. సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చి, ఉద్యమకారులను పోలీసుల సాయంతో కిందికి దింపారు. అనంతరం పోలీస్ వాహనంలో గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్టేషన్‌కు తరలించారు.