Heavy Rains | హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : ఆగస్టు రెండో వారం నుంచి హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభం నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం 347.2 మి.మీ ఉండగా, 338.2 మి.మీ నమోదైనట్టు తెలిపింది.
ఈ 3శాతం లోటు వర్షపాతం 33జిల్లాల్లోని ఐదు జిల్లాల్లో కొనసాగుతున్నదని పేర్కొన్నది. గడిచిన 24గంటల్లో ఆదిలాబాద్ జిల్లాలోని బేలలో 2.63 సెం.మీ అత్యధిక వర్షపాతం నమోదు కాగా, సాత్నాలలో 2.53 సెం.మీ, గడిగూడలో 2.31 సెం.మీ, జైనథ్‌లో 2.0 సెం.మీ, బోరజ్లో 1.9 సెం.మీ, ఇంద్రవెల్లిలో 1.81 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు పేర్కొన్నది.