హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ఎక్సైజ్ శాఖను బురిడీ కొట్టించి ప్రభుత్వానికి సుంకం చెల్లించకుండా వంద పెట్టెల మద్యాన్ని అమ్మేసి సొమ్ము చేసుకున్న ఉదంతం శుక్రవా రం వెలుగులోకి వచ్చింది. బగ్గా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తెలంగాణ బ్రూవరీస్ కార్పొరేషన్‌కు మద్యం సరఫరా చేస్తున్నది. ఆ కంపెనీకి చెందిన జనరల్ మేనేజర్, ఎక్సైజ్ శాఖకు చెం దిన ఓ ఉన్నతాధికారి మద్యాన్ని పకదారి పట్టించి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులకు అనుమా నం రాకుండా పాత లికర్ లోగోలను సేకరించి వాటిని వాడుకొని వందల కొద్దీ కాటన్ల మద్యాన్ని తయారు చేసి పెట్టుకున్నారు. వీటి విలువ రూ.5 లక్ష ల వరకు ఉంటుందని సమాచారం. ఈ విషయంలో స్టేట్ టాస్‌ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అందిన పకా సమాచారం మేరకు బగ్గా డిస్టిలరీస్‌ను తనిఖీ చేశారు.
అనుమానం వచ్చిన పాత లేబుళ్ల మద్యాన్ని సానింగ్ చేయడంతో అసలు విషయం బయటపడింది. మద్యం తయారు చేసే ఈఎన్ఏ రా మెటీరియల్‌ను అక్రమంగా బయటి నుంచి తెప్పించుకొని ఈ మద్యాన్ని తయారు చేస్తున్నట్టు నిందితులు అంగీకరించారు. ఈ విషయం లో పాత లేబుళ్లతో తయారు చేసిన మద్యాన్ని సీజ్ చేసిన అధికారులు డిస్టిలరీస్ మేనేజర్, యజమానితోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఒకరిని అరెస్టు చేశామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. సదరు డిస్టిలరీని పర్యవేక్షిస్తున్న ఎక్సైజ్ అధికారులపై కూడా చర్యలు తీసుకోవచ్చని సమాచారం.